JioBharat 4G| జియో దీపావళి బంపర్ ఆఫర్
JioBharat 4G| జియో దీపావళి బంపర్ ఆఫర్
రీఛార్జ్ ధరకే మొబైల్ !
దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ జియో తన ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం ఇటీవల దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రారంభించింది. రూ.899, రూ.3599 రీఛార్జ్ ప్లాన్‌లతో రూ.3350 విలువైన ప్రయోజనాలను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అందులో రూ. 3,000 విలువైన ఈజ్ మై ట్రిప్ ఓచర్, రూ. 200 విలువైన అజియో షాపింగ్ ఓచర్, అలాగే మరో రూ. 150 విలువ కలిగిన స్విగ్గీ ఫుడ్ డిస్కౌంట్ కూపన్ ఉన్నాయి. ఈ నెల 25 నుండి నవంబర్ 5వ తేదీ వరకు ఈ రీచార్జ్ ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నట్లు జియో ప్రకటించింది. ఇక ఇవే కాకుండా JioBharat 4G ఫోన్ ధరను 30 శాతం తగ్గించి దీపావళికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది.
*అక్టోబర్ 29లోపు ఆర్డర్ చేస్తే భారీ డిస్కౌంట్!
జీఎం ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లో రూ. 999 విలువైన జియోభారత్ మొబైల్ ఫోన్ ఇప్పుడు మార్కెట్లో రూ.699 ప్రత్యేక ధరకు అందుబాటులో ఉంది. జియో భారత్ ఫోన్‌ను రూ.123తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ నెలవారీ టారిఫ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్, 14 GB డేటా కూడా అందుబాటులో ఉంటుంది. జియో నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 123 మాత్రమే. ఇతర ఆపరేటర్ల కంటే 40 శాతం తక్కువ. ఎందుకంటే ఇతర నెట్‌వర్క్‌లు ఫీచర్ ఫోన్‌ల కోసం నెలవారీ రీఛార్జ్ కోసం రూ. 199 వసూలు చేస్తున్నాయి. ఇది జియో కంటే 76 రూపాయలు ఎక్కువ. అంటే ప్రతి రీఛార్జ్‌పై వినియోగదారులు నెలకు రూ. 76 ఆదా చేసుకుంటే కేవలం 9 నెలల్లో మొత్తం ఫోన్ ధర రికవరీ అవుతుంది. ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు.. 2G నుండి 4Gకి మారడానికి ఇది ఒక అవకాశం. 455కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, సినిమా ప్రీమియర్‌లు, కొత్త సినిమాలు, వీడియో షోలు, లైవ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌లు, జియో సినిమా హైలైట్‌లు, డిజిటల్ చెల్లింపులు, క్యూఆర్ కోడ్ స్కాన్‌లు వంటి ఫీచర్లు జియో భారత్ 4G ఫోన్‌లలో అందుబాటులో ఉన్నాయి. జియో చాట్ వంటి ప్రీలోడెడ్ యాప్‌లు కూడా ఈ ఫోన్‌లో ఉంటాయి. ఫోన్‌ను అమెజాన్, ఇతర స్టోర్‌ల నుంచి కొనవచ్చు.
* * *
Leave A Comment